అలనాటి శృంగార తార జయమాలిని ఇంట పెళ్లి సందడి

  • 80వ దశకంలో ఒక వెలుగు వెలిగిన జయమాలిని
  • రేపు జయమాలిని కుమారుడు హరి వివాహం
  • పెళ్లికి తరలిరానున్న అలనాటి నటీనటులు
ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో కనిపించకపోయినా జయమాలినిని సినీ అభిమానులు ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. కుటుంబ పోషణ కోసం సినిమాల్లోకి వచ్చిన జయమాలిని చిన్న వయసులోనే డ్యాన్సర్ గా మారిపోయింది. ఆ రోజుల్లో అగ్ర నటులందరి సినిమాల్లో ఐటెం సాంగులు ఉండేవి. వాటిని హీరోయిన్లు చేసేవారు కాదు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత వంటి శృంగార తారలు మాత్రమే చేసేవారు. 80వ దశకంలో వెండితెరపై జయమాలిని ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఆమె పోలీస్ అధికారి పార్తీబన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది. కుటుంబానికే ప్రాధాన్యతను ఇస్తూ సంతోషకర జీవితాన్ని గడుపుతోంది. 

జయమాలిని, పార్తీబన్ ల పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులే. వారి కుమారుడు హరి స్పెయిన్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఇప్పుడు ఆయన వివాహం జరగబోతోంది. చెన్నైకి చెందిన ప్రియాంకతో మద్రాస్ వీజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ లో రేపు వివాహం జరగనుంది. ఈ రాత్రి అక్కడే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు అలనాటి నటీనటులు హాజరుకానున్నారు. పెళ్లి కూతురు ప్రియాంక ఇంజినీరింగ్ చేసిన తర్వాత ఐఐఎంలో ఎంబీఏ చేసింది. 


More Telugu News