‘మెటా’ మరో షాక్.. మరికొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన!
- గతేడాది నవంబరులో 11 వేలమందిని తొలగించిన ‘మెటా’
- నాన్ ఇంజినీరింగ్ విభాగంలో తొలగింపులు ఉండే అవకాశం
- వేలాదిమంది ఉద్యోగులకు ‘సబ్‌పార్’ రేటింగులు’
- వాటి ఆధారంగానే తొలగింపులు
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటా ఉద్యోగులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. నాన్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ తొలగింపులు ఉంటాయని పేర్కొంది. గతేడాది నవంబరులో 11 వేల మంది ఉద్యోగులను (మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 13శాతం) మెటా తొలగించింది. ఇప్పుడు మరింతమందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.
తాజా తొలగింపులకు కూడా ఆర్థిక అనిశ్చితి, ఆదాయం తగ్గడం వంటి కారణాలను సాకుగా చూపుతోంది. గతేడాది నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 32.17 బిలియన్లుగా ఉండగా, గతేడాది మొత్తంగా 116.11 బిలియన్లుగా ఉంది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది వరుసగా 4 శాతం, ఒక శాతం తగ్గింది.
ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని ప్రాజెక్టులను తగ్గించడంతోపాటు ఉద్యోగాల్లో కోతలు విధించాలని నిర్ణయించినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొంది. అయితే, ఈ కోతలు ఒకేసారి కాకుండా క్రమంగా ఉంటాయని అంచనా వేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేలాదిమందికి కంపెనీ ‘సబ్‌పార్ రేటింగులు’ ఇచ్చింది. వీటి ఆధారంగానే తొలగింపులు ఉంటాయని భావిస్తున్నారు.