దివాలా అంచున ఉన్న పాక్‌ను ఆదుకున్న చైనా.. 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం
- పాక్‌కు రుణం ఇచ్చేందుకు చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు అంగీకారం
- మరో వారం రోజుల్లో పాకిస్థాన్‌కు అందనున్న రుణం
- ఊపిరి పీల్చుకున్న పాక్
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాలా అంచున నిలిచిన పాకిస్థాన్‌ను మిత్ర దేశమైన చైనా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. రూ. 700 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నిబంధనల మేరకు ద్రవ్య బిల్లును పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఒక రోజు తర్వాత రుణం ఇచ్చేందుకు చైనా అంగీకరించడం గమనార్హం.
మరో వారం రోజుల్లో ఈ సొమ్ము పాకిస్థాన్‌కు అందనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఈ నెల 10 నాటికి పాక్ సెంట్రల్ బ్యాంకు వద్ద 3.2 బిలియన్ డాలర్లు మాత్రమే మిగిలాయి. ఆ సొమ్ము ఆ దేశ దిగుమతులకు 3 వారాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉండడంతో దిగుమతులపై పాక్ నిషేధం విధించింది. ఇప్పుడు చైనా ఆర్థిక సాయంతో ఆ దేశం ఊపిరి పీల్చుకుంది.