సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాకరేకు షాక్

  • శివసేన పేరు, గుర్తును షిండే వర్గానికి కేటాయించిన ఈసీ
  • ఈసీ నిర్ణయంపై స్టే విధించాలని సుప్రీంలో పిటిషన్ వేసిన థాకరే 
  • స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏక్ నాథ్ షిండే వర్గానిదే శివసేన అని, ఆ పార్టీ గుర్తు విల్లు, బాణం కూడా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో బాలాసాహెబ్ థాకరే పేరును, కాగడా గుర్తును కొనసాగించవచ్చని థాకరే వర్గానికి సూచించింది. మరోవైపు ఈసీ నోటిఫికేషన్ పై ఈసీకి, షిండే వర్గానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానమివ్వాలని, మరో వారం రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News