మొత్తానికి కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేశాడు!
- ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్
- మూడు ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో
- 'వినరో భాగ్యము విష్ణుకథ'కి వచ్చిన హిట్ టాక్
- మొత్తానికి కిరణ్ ఓ గండం గట్టెక్కేసినట్టే
నాని తరువాత ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్నవారిలో కిరణ్ అబ్బవరం ఒకరుగా కనిపిస్తాడు. బలమైన నేపథ్యం లేకుండా వచ్చినవారికి ఫ్లాపుల నుంచి పాఠాలను నేర్చుకుని సరిదిద్దుకునే ఛాన్స్ ఉండదు. ప్రేక్షకులు అంత ఓపిక పట్టరు .. నిర్మాతలు అంత అవకాశం ఇవ్వరు.
అందువలన ప్రతి ఫ్లాప్ ఈ తరహా హీరోలను ఒక రేంజ్ లో టెన్షన్ పెట్టేస్తుంది. 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' తరువాత కిరణ్ కి హిట్ పడలేదు. ఆయన చేసిన 'సెబాస్టియన్' .. 'సమ్మతమే' .. 'నేను మీకు బాగా కావలసినవాడిని' ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇక కిరణ్ హిట్ కొట్టడంలో ఆలస్యమైతే కష్టమేనని చాలామంది అనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' హిట్ టాక్ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లో 7.57 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా మరిన్ని రోజులు ఇదే జోరును చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో హిట్ పడటంతో గండం గట్టెక్కేసినట్టుగా తేలికగా కిరణ్ ఊపిరి పీల్చుకుంటున్నాడు.