'గుడ్ మార్నింగ్ అమెరికా' టీవీ షోలో రామ్ చరణ్!

  • రీసెంటుగా అమెరికా వెళ్లిన చరణ్ 
  • 'గుడ్ మార్నింగ్ అమెరికా' షో నుంచి ఆహ్వానం 
  • ఇండియాలో ఈ రోజు రాత్రి 11: 30 గంటలకు ప్రసారం 
  • 'ఆర్ ఆర్ ఆర్' విశేషాల గురించి చెప్పనున్న చరణ్ 
గుడ్ మార్నింగ్ అమెరికా .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నోటి నుంచి ఈ డైలాగు వస్తే? వస్తే ఏంటి ...? రాబోతోంది .. అదీ మరికొన్ని గంటల్లో. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు అమెరికాకు చేరింది. ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ రోజు (ఫిబ్రవరి 22న) ప్రసారం కానున్న టీవీ షోలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు.

'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం భారతీయ కథానాయకులలో ఈ ఘనత అందుకున్నది కూడా ఆయనే.

అమెరికాలో మధ్యాహ్నం ఒంటి గంటకు, మన భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు 'గుడ్ మార్నింగ్ అమెరికా - రామ్ చరణ్' కార్యక్రమం టెలికాస్ట్ కానుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్, తర్వాత సంగతులతో పాటు కొత్త సినిమాల గురించి రామ్ చరణ్ షోలో మాట్లాడనున్నారు.  

ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్లారు. ఈ నెల 24న జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రోగ్రామ్ లో కూడా రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ప్రజెంటర్ గా అవార్డ్ ఇవ్వనున్నారు. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరో కూడా చరణ్ కావడం గమనార్హం.


More Telugu News