ఆ హీరోతో చేయాలనే కోరిక నెరవేరలేదు: నటి శాంతిప్రియ

  • వంశీ 'మహర్షి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాంతిప్రియ
  • వివాహం తరువాత నటనకి దూరం
  • భర్తను కోల్పోయిన శాంతిప్రియ 
  • ఒంటరి పోరాటం చేశానని వెల్లడి 
  • వెంకీతో చేయలేకపోయానని అసంతృప్తి
భానుప్రియ చెల్లెలుగా తెలుగు తెరకి శాంతిప్రియ పరిచయమయ్యారు. భానుప్రియ మాదిరిగానే ఆమె కూడా వంశీ దర్శకత్వంలోనే తొలి సినిమా చేశారు .. ఆ సినిమా పేరే 'మహర్షి'. ఆ తరువాత ఆమె మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఫస్టు సినిమానే ఆమె కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. హిందీ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె, 1994 తరువాత ఇక వెండితెరపై కనిపించలేదు. 

తాజా ఇంటర్వ్యూలో శాంతిప్రియ మాట్లాడుతూ .. "సిద్ధార్థ్ రాయ్ తో నా వివాహం జరిగింది. పెళ్లి తరువాత నటనకి దూరంగా ఉన్నాను. మా వారు చనిపోయిన తరువాత, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. ముంబైలో నాకు ధైర్యం చెప్పేవారు .. ఓదార్చేవారు ఎవరూ లేరు. అయినా నాకు నేను ధైర్యం చెప్పుకుని ముందుకు వెళ్లాను. చెన్నైలో ఉన్నప్పటికీ అమ్మ .. అక్కయ్య .. అన్నయ్య సపోర్టు ఉండేది" అన్నారు. 

"నేను సినిమాలు చేసేటప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అప్పట్లో నాకు వెంకటేశ్ గారితో కలిసి యాక్ట్ చేయాలనుండేది .. కానీ కుదరలేదు. నేను ఇక్కడికి వచ్చి 30 ఏళ్లు అవుతోంది. చెన్నై వాళ్లు నేను ముంబైలో ఉన్నానని అనుకుంటే, ముంబైవారు నేను చెన్నైలో ఉన్నానని అనుకుంటున్నారు. అవకాశాలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది" అంటూ చెప్పుకొచ్చారు.  


More Telugu News