టీడీపీ ఆఫీసులో కానిస్టేబుల్ చేతివాటం.. వీడియో ఇదిగో!
- బందోబస్తు విధులకు వచ్చి దొంగతనం
- సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఘటన
- సోషల్ మీడియాలో విడుదల చేసిన టీడీపీ నేతలు
గన్నవరం టీడీపీ ఆఫీసులో ఓవైపు దుండగుల దాడితో గందరగోళం నెలకొనగా ఇదే మంచి అవకాశం అనుకున్నాడో కానిస్టేబుల్.. తన చేతివాటం ప్రదర్శించి ఆఫీసులోని ఇయర్ బడ్స్ ను జేబులో వేసుకున్నాడు. గందరగోళంలో ఎవరూ గమనించరని అనుకున్నాడో లేక దుండగులపైకి పోతుందిలే అని అనుకున్నాడో కానీ గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేశాడు. అయితే, సదరు కానిస్టేబుల్ చర్యని ఆఫీసులోని సీసీటీవీ కెమెరా పట్టిచ్చింది. ఆయనగారి నిర్వాకం మొత్తాన్నీ రికార్డు చేసింది. తాజాగా ఈ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా చెప్పుకుంటున్న వాళ్లు టీడీపీ ఆఫీసుపై దండెత్తారు. ఆఫీసులో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ దాడితో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ ఆఫీసు ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో భాగంగా అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ ఆఫీసులోకి వెళ్లి విలువైన వస్తువుల కోసం వెతుకులాట మొదలు పెట్టాడు.
టేబుల్ సొరుగులో ఇయర్ బడ్స్ కనబడడంతో వాటిని పరిశీలిస్తున్నట్లు నటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకున్నాడు. ఆపై ఏమీ ఎరగనట్లు బయటకు వచ్చాడు. అయితే, ఆపీసులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఇదంతా రికార్డయింది. తర్వాత టీడీపీ నేతలు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది.