'వినరో భాగ్యము విష్ణు కథ' 3 రోజుల వసూళ్లు ఇవే!

'వినరో భాగ్యము విష్ణు కథ' 3 రోజుల వసూళ్లు ఇవే!
  • ఈ నెల 18న వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ'
  • కిరణ్ జోడీగా అలరించిన కశ్మీర పరదేశి 
  • యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ టచ్ తో నడిచిన కథ 
  • 3 రోజుల్లో 6.67 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమా
కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కశ్మీర పరదేశి కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

తొలి 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.67 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. దగ్గరలో పోటీ ఇచ్చే సినిమాలైతే లేవు. అందువలన ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లనే రాబట్టే అవకాశాలు ఉన్నాయి. 

కథ .. కథనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కిరణ్ అబ్బవరం యాక్షన్ .. మురళీశర్మ కామెడీ .. కొత్త విలన్ చూపించిన కొత్త మార్క్ .. ఇలా ఇవన్నీ కూడా ఈ సినిమాను నిలబెట్టాయని చెప్పొచ్చు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కిరణ్ అబ్బవరానికి ఈ సినిమా సక్సెస్ కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి.


More Telugu News