చాన్నాళ్ల తర్వాత టీవీ9 ఆఫీసులో అడుగుపెట్టిన రవిప్రకాశ్

  • అప్పట్లో రవిప్రకాశ్ పై వివాదం
  • నిధుల దుర్వినియోగం కేసు నమోదు
  • తాజాగా టీవీ9 ఆఫీసు వద్ద కనిపించిన రవిప్రకాశ్
  • టీవీ9లో తాను కూడా భాగస్వామినే అని వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి న్యూస్ చానల్ టీవీ9ను ఒకప్పుడు అన్నీ తానై నడిపించిన సీనియర్ పాత్రికేయుడు రవిప్రకాశ్ అనూహ్యరీతిలో తెరమరుగైపోయారు. అయితే, చాన్నాళ్ల తర్వాత ఆయన మళ్లీ టీవీ9 ఆఫీసులో అడుగుపెట్టారు. హైదరాబాదులోని టీవీ9 ప్రధాన కార్యాలయం వద్ద రవిప్రకాశ్ ను మీడియా పలకరించగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన రాక వెనకున్న కారణాన్ని వివరించారు. 

"టీవీ9లో ప్రధానంగా నలుగురు భాగస్వాములు ఉన్నారు. ఒకరు మైహోమ్ రామేశ్వరరావు, రెండోది మెఘా కృష్ణారెడ్డి, మూడోది ఎంవీకేఎన్ మూర్తి, నాలుగోది నేను. మేం నలుగురం భాగస్వాములుగా టీవీ9, ఏబీసీఎల్ సంస్థలు నడుస్తున్నాయి. ప్రస్తుతం టీవీ9లో అకౌంట్స్ చూడ్డానికి వచ్చాను. అకౌంట్స్ కు సంబంధించిన సమాచారం కోసం ఇవాళ టీవీ9 ఆఫీసుకు వచ్చాను" అని వెల్లడించారు. 

టీవీ9కి చెందిన రూ.18 కోట్ల నిధులను రవిప్రకాశ్ అక్రమంగా డ్రా చేశారంటూ అప్పట్లో కేసు నమోదు కావడం తెలిసిందే. టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా గడిపారు. తదనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.


More Telugu News