పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ వర్గాలతో చంద్రబాబు సమావేశం

  • ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ ఇన్చార్జిల పనితీరుకు పరీక్ష అన్న బాబు 
  • ఓట్లు అడిగే హక్కు జగన్ కు లేదంటూ విమర్శలు
ఏపీలో మార్చి 13న పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ ఇన్చార్జిల పనితీరుకు పరీక్ష అని స్పష్టం చేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు జగన్ కు లేదని అన్నారు. మండలి రద్దుకు తీర్మానం చేసి ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. శాసనమండలి దండగ అంటూనే ఓట్లు అడిగేందుకు ఎలా వస్తారు? అని నిలదీశారు. 

ఏపీలో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు కాగా, 3 పట్టభద్రుల స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి.


More Telugu News