టర్కీలో కుప్పకూలిన భవంతి, కమ్మేసిన దుమ్ము.. వీడియో ఇదిగో!
- హతాయ్ ప్రావిన్స్ లో మరోమారు కంపించిన భూమి
- భూకంపం తీవ్రతకు భారీ భవనం నేలమట్టం
- భయంతో పరుగులు తీసిన ప్రజలు
- సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యం
ఈ నెల మొదట్లో సంభవించిన భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీలో మరోమారు భూమి కంపించింది. సోమవారం రాత్రి భూమి కంపించడంతో హతాయ్ ప్రావిన్స్ లో భారీ భవనం ఒకటి పేకమేడలా కూలిపోయింది. దీంతో భారీగా దుమ్ము ఎగిసిపడింది. అక్కడ ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హతాయ్ మేయర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. సోమవారం రాత్రి భూప్రకంపనలకు పలు భవనాలు కూలిపోయాయని, అందులో చాలామంది చిక్కుకుపోయారని చెప్పారు. తాజా ఘటనలో ఇప్పటికే ముగ్గురు మరణించారని తెలిపారు. హతాయ్ ప్రావిన్స్ లోని డెఫ్నే సిటీలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించారు. కాగా, సోమవారం రాత్రి సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ లలో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.