విమానం ఎమర్జెన్సీ డోర్ హ్యాండిల్ తాకినందుకు ఇంజినీరింగ్ విద్యార్థిపై కేసు
- చెన్నై-ఢిల్లీ విమానంలో ఎమర్జెన్సీ డోర్‌ను తాకిన ఇంజినీరింగ్ విద్యార్థి
- విద్యార్థిని అడ్డుకున్న ఫ్లైట్ సిబ్బంది
- విమానం కెప్టెన్ ఫిర్యాదుతో కేసు నమోదు
విమానం ఎమర్జెన్సీ డోర్‌ను తాకినందుకు ఓ ఇంజినీరింగ్ విద్యార్థిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. శనివారం చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఆ విద్యార్థి ఎమర్జెన్సీ డోర్‌ను తాకాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఆ తరువాత విషయాన్ని కెప్టెన్‌కు (ప్రధాన పైలట్) తెలియజేశారు. దీంతో కెప్టెన్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే తాను కేవలం డోర్ హ్యాండిల్‌ను తాకానని, తలుపు తెరిచే ఉద్దేశం అస్సలు లేదని విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థికి నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థిని అరెస్టు చేయకపోయినప్పటికీ అతడు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
విమానయాన నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ తాకకూడదు. అత్యవసర సమయాల్లోనూ విమానం కెప్టెన్ అనుమతించాకే ఎమర్జెన్సీ డోర్‌ను తెరవాలి. అయితే.. కొన్ని విమానాల్లో ఎమర్జెన్సీ డోర్ హ్యాండిల్‌పై కవర్ లేకపోవడంతో ప్రయాణికులు పొరపాటున తాకే అవకాశం ఉందని విమాన సిబ్బంది చెబుతారు. తొలిసారి విమాన ప్రయాణం చేసేవారు ఎమర్జెన్సీ డోర్ హ్యాండిల్‌ను చేయి పెట్టుకునేందుకు ఆసరాగా భావించే ఆస్కారం ఉందనీ అంటారు.