హోం టూర్ వీడియోలో కనిపించిన చిలుకలు.. నటుడు రోబో శంకర్‌కు రూ. రెండున్నర లక్షల జరిమానా!
- నటుడిని చిక్కుల్లో పడేసిన హోంటూర్ వీడియో
- మూడేళ్లుగా అలెంగ్జాండ్రిన్ పారాకీట్ చిలుకలను పెంచుకుంటున్న నటుడు
- స్వాధీనం చేసుకుని పార్కులో అప్పగించిన అటవీశాఖ అధికారులు
- వాటిని పెంచుకునేందుకు అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదని వివరణ
- క్షమాపణలు కోరడంతో జరిమానాతో సరిపెట్టిన అధికారులు
ఇంటిని వీడియో తీసి ‘హోం టూర్’ పేరుతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు రోబో శంకర్ అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వీడియోలో చిలుకలు ఉండడం చూసిన అటవీశాఖ అధికారులు వెంటనే ఆయన ఇంటికి చేరుకుని చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. నటుడికి చెన్నై సాలిగ్రామంలో ఇల్లు ఉంది. ‘హోం టూర్’ పేరుతో ఇంటిని వీడియో తీసిన శంకర్ దానిని సోషల్ మీడియాలో పెట్టాడు.
ఈ వీడియో బాగా వైరల్ అయింది. అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. అలెంగ్జాండ్రిన్ పారాకీట్ అనే రెండు చిలుకలు పంజరంలో ఉండడాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే నటుడి ఇంటికి చేరుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని గిండీలోని పార్కులో అప్పగించారు. ఆ సమయంలో రోబో శంకర్, ఆయన భార్య శ్రీలంకలో ఉండడంతో దర్యాప్తుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో నిన్న ఆయన అటవీశాఖ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నాడు. మూడేళ్ల క్రితం తన భార్య స్నేహితురాలు ఆ చిలుకలను తెచ్చి ఇవ్వడంతో పెంచుకుంటున్నామని, అయితే వాటిని పెంచుకునేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు. తనను క్షమించాలని కోరాడు. దీంతో అధికారులు కేసు నమోదు చేయకుండా రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించి వదిలేశారు.