ఏపీకి మరిన్ని వందేభారత్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది: విజయసాయిరెడ్డి
- ఇటీవల సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు ప్రారంభం
- ఈ రైలు గ్రాండ్ సక్సెస్ అయిందన్న విజయసాయిరెడ్డి
- ఏపీని కలుపుతూ మరిన్ని వందేభారత్ రైళ్లకు విజ్ఞప్తి
- విశాఖ నుంచి చెన్నై, బెంగళూరుకు నడపాలంటూ ట్వీట్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలును ప్రారంభించడం తెలిసిందే. త్వరలోనే సికింద్రాబాద్-తిరుపతి కానీ, సికింద్రాబాద్-చెన్నై మధ్య కానీ ఏపీ మీదుగా మరో వందేభారత్ రైలును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ విశేష రీతిలో ప్రజాదరణ పొందుతోందని, ఏపీని కలుపుతూ మరిన్ని వందేభారత్ రైళ్లు నడపాల్సిన అవసరాన్ని ఇది చాటుతోందని అభిప్రాయపడ్డారు.
స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని, ఈ తరహా స్లీపర్ వందేభారత్ రైళ్లను వైజాగ్ నుంచి చెన్నై, బెంగళూరు నగరాలు నడపాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కోరుతున్నట్టు తెలిపారు.