నెట్టింట్లో నూడుల్స్ వీడియో వైరల్.. చూస్తేనే వాంతి వస్తోందంటూ నెటిజన్ల గగ్గోలు!

  • థాయ్‌లాండ్‌ స్ట్రీట్ ఫుడ్ వీడియో వైరల్
  • నల్లటి వానపాముల్లా కనిపిస్తున్న నూడుల్స్
  • ఛీదరించుకుంటున్న నెటిజన్లు
నెట్టింట్లో కొత్త వంటకాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే.. కొన్నింటిని చూస్తే మాత్రం వెగటు పుట్టకమానదు. థాయ్‌లాండ్‌ స్ట్రీట్ ఫుడ్ వీడియో ఒకటి ప్రస్తుతం జనాలతో గగ్గోలు పెట్టిస్తోంది. చూస్తేనే వాంతి వస్తోందంటూ నెటిజన్లు వేల కొద్దీ కామెంట్స్ పెడుతున్నారు. 

ఇది నూడుల్స్‌కు సంబంధించిన వీడియో. అవర్ కలెక్షన్స్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో తొలిసారిగా ఈ వీడియో పోస్ట్ అయ్యింది. వీడియోలోని మహిళ వండిన నూడుల్స్ చూసి జనాలు దడుసుకుంటున్నారు. నల్లటి వానపాముల్లా ఉన్న నూడుల్స్‌పై ఉప్పు, కారం, మసాలాలు దట్టించి జనాలకు అందచేస్తోందా మహిళ. ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ వీడియోను భారతీయ నెటిజన్లు మాత్రం ఛీదరించుకుంటున్నారు. ‘‘ఇవేమన్నా వానపాములా లేక పిల్ల పాములా.. చూస్తూ చూస్తూ ఇలాంటి ఆహారాన్ని ఎవరైనా తినగలరా?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లను ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఆ నూడుల్స్ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


More Telugu News