సౌందర్య లేని ఆ ఇంటిని చూడలేకపోయాను: నటి ఆమని
- సౌందర్య గురించి ప్రస్తావించిన ఆమని
- ఆమె మరణం కదిలించి వేసిందని వెల్లడి
- అందుకే చూడటానికి వెళ్లలేదని వ్యాఖ్య
- ఆమె తల్లిని ఓదార్చే శక్తి తనకి లేకుండాపోయిందని ఆవేదన
కథానాయికగా మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న ఆమని, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ .. "ఈవీవీగారు నా గురువు అనే చెబుతాను. ఆయన వల్లనే నేను నిలబడగలిగాను. అలాంటి ఈవీవీ గారు పోయినప్పుడు నేను రాలేకపోయాను. అప్పుడు నేను ఇక్కడ లేకపోవడమే అందుకు కారణం" అన్నారు.
"ఇక సౌందర్య .. నేను ఎంతో స్నేహంతో ఉండే వాళ్లం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో చేశాము. ఒకరి విషయాలను ఒకరం చెప్పుకుంటూ ఉండేవారం. అలాంటి సౌందర్య చనిపోయినప్పుడు నేను ఒక సినిమా షూటింగులో ఉన్నాను. ఆ వార్త తెలియగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. ఆమెను అలా చూడలేక వెళ్లలేదు" అని చెప్పారు.
''సౌందర్య చనిపోయిన ఒక నెలకి వాళ్ల ఇంటికి వెళ్లాను .. ఆమె తల్లితో మాట్లాడాను. సౌందర్య లేని ఆ ఇంటినీ .. ఆమె ఫొటో దగ్గర పెట్టిన పూలను చూడలేకపోయాను. ఆమె తల్లిని ఓదార్చే శక్తి కూడా అప్పుడు నాకు లేదు. కొత్త ఇంట్లోకి మారిన తరువాత ఇలా జరిగిందంటూ ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. నన్ను బాగా కదిలించివేసిన సంఘటనల్లో సౌందర్య మరణం ఒకటి" అంటూ చెప్పుకొచ్చారు.