అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేసి చూడండి!
- వంటింటి చిట్కాలతో వాటిని వదిలించుకోవచ్చు
- పుదీనా టీ తాగడం వల్ల ఫలితం కనిపిస్తుందంటున్న నిపుణులు
- బొప్పాయి ముక్కలకు కాస్త పసుపు జోడించి రాసుకుంటే ముఖం మృదువుగా మారచ్చు
ముఖంపై అవాంఛిత రోమాలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలగించుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ నానాపాట్లు పడుతుంటారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం వంటింట్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. సింపుల్ గా ఇంట్లో దొరికే వాటితోనే అవాంఛిత రోమాలను వదిలించుకోవచ్చని అంటున్నారు.
దీనికోసం నిపుణులు చెబుతున్న వంటింటి చిట్కాలు.. బొప్పాయి ముక్కలు పేస్ట్ లా చేసుకుని అందులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకుంటే అవాంఛిత రోమాలు పెరగవని సూచిస్తున్నారు. శనగపిండికి రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకున్నా ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. కాస్త పంచదార, నిమ్మరసం, తేనె, కార్న్ ఫ్లోర్.. మొత్తం బాగా కలిపి ముఖానికి పట్టించి, మసాజ్ చేయడం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయని చెప్పారు.
బాగా పండిన అరటి పండుకు ఓట్స్ కలుపుకుని ముఖానికి రాసుకుని స్క్రట్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుందట. అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి పుదీనా టీ చక్కని ఉపాయమని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా పుదీనా టీ తాగడం వల్ల రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయులు తగ్గుతాయని వివరించారు. ఫలితంగా అవాంఛిత రోమాలు తొలగిపోయి ముఖం మృదువుగా తయారవుతుందని తెలిపారు.