అశ్విన్, జడేజా బౌలింగ్ లో ఆడాలనుకుంటే.. ఇలానే ఉంటుంది.. వీడియోతో వసీం జాఫర్ సెటైర్
- రెండో టెస్టులో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా
- టీమిండియా స్పిన్ ను ఎదుర్కోలేక విలవిల
- ట్రోల్ చేస్తూ వీడియో ట్వీట్ చేసిన వసీమ్ జాఫర్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయింది ఆస్ట్రేలియా. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొలేక చతికిలపడింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0తో వెనుకబడింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్.. ఆసీస్ టీమ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ల బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎలా ఇబ్బంది పడ్డారనేది సెటైరికల్ గా తెలియజేశాడు. ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
ఆ వీడియోలో.. ఓ వ్యక్తి మొక్కజొన్న పొత్తును రంధ్రాలు చేసే యంత్రానికి అమర్చాడు. ఆ యంత్రాన్ని ఆన్ చేయగానే.. మొక్క జొన్న పొత్తు వేగంగా తిరగడం మొదలు పెట్టింది. దాన్ని పళ్లతో పట్టుకుని తినేందుకు సదరు వ్యక్తి ప్రయత్నించడం.. దెబ్బకు ముందున్న రెండు పళ్లు ఊడిపోవడం.. అతడి రియాక్షన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు. అశ్విన్, జడేజా వేసే బంతులు కూడా ఇలానే గిర్రున తిరుగుతాయని, ఆడటానికి ప్రయత్నిస్తే పళ్లు ఊడుతాయని జాఫర్ చెప్పకనే చెప్పాడు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ వసీమ్ జాఫర్ చమత్కారంగా ట్వీట్లు చేశాడు. టీమిండియాను విమర్శించే వారికి సెటైరికల్ ట్వీట్లతోనే కౌంటర్లు ఇచ్చాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ ప్లేయర్లు, మాజీ ప్లేయర్లు ఎప్పుడైనా మాటలతో కయ్యానికి కాలు దువ్వితే.. ట్వీట్లతోనే నోరు మూయించాడు. వసీమ్ జాఫర్ మైదానంలో ఆట ఆపినా.. సోషల్ మీడియాలో ఆపలేదు మరి!