20 భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఈ స్కూటర్

  • కేవలం రూ.499లతో బుక్ చేసుకోవచ్చంటున్న కంపెనీ
  • రెండు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల
  • ఏడు సెకన్లలోనే 60 కి.మీ. వేగాన్ని అందుకునే పికప్
  • ఫుల్ ఛార్జ్ తో 115 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు 
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా.. సేఫ్టీ విషయంలో ఆందోళన చెందుతున్నారా.. అయితే మీకోసమే 20 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో సరికొత్త ఈ-స్కూటర్ ను బిగాస్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. భద్రత విషయంలో రాజీపడకుండా హై బ్యాటరీ రేంజ్ తో పాటు ఫాస్ట్ యాక్సిలరేషన్ తో బిగాస్ డి 15 ను తయారుచేసినట్లు వెల్లడించింది. సామాన్యుడికి అందుబాటు ధరలో హై ఎండ్ ఫీచర్లతో తయారుచేసిన ఈ స్కూటర్ బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది.

బిగాస్ కంపెనీ ఇటీవలే మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ బిగాస్ డి 15ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ స్కూటర్ లో రెండు డజన్ల భద్రతా ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. బిగాస్ డి15ఐ ధర రూ.99,999(ఎక్స్ షోరూమ్) కాగా, బిగాస్ డి15 ప్రో ధర రూ.1,14,999(ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించినట్లు వెల్లడించింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.499 చెల్లించి ఈ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

స్కూటర్ ప్రత్యేకతలు..
  • బ్యాటరీ: 3.2 కిలోవాట్స్ సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీ, 5:30 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
  • పికప్: కేవలం 7 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. 
  • బ్రేక్: ముందు, వెనక డ్రమ్ బ్రేక్ లకు కాంబి బ్రేకింగ్ సిస్టంను జోడించింది. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనకవైపు షాక్ అబ్జార్బర్ సిస్టంతో సస్పెన్షన్ వ్యవస్థ ఉంది.
  • భద్రత: యాంటీ థెఫ్ట్ అలారం, ఐపీ67 రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్, స్మార్ట్ బ్యాటరీ, మోటార్ కంట్రోలర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.


More Telugu News