యువజంటకు రెస్టారెంట్‌లో షాకింగ్ అనుభవం.. పబ్లిక్‌గా చెంపదెబ్బలు!

  • వాలంటైన్స్ డే రోజున షాకింగ్ సీన్
  • ప్రేమజంటను చెప్పుదెబ్బలు కొట్టిన మహిళ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
వాలంటైన్స్‌ డే రోజున ఓ ప్రేమికుల జంటకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు ఈ వీడియోను షేర్ చేశారు. రెస్టారెంట్‌లో ఆ జంట కూర్చుని ఉండగా ఓ పెద్దావిడ వారిని గుర్తించి చెప్పుతీసుకుని చెడామడా వాయించేసింది. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ భారత్, పాకిస్థాన్‌లలో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమే అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ మహిళ యువతీయువకుల్లో ఒకరికి కచ్చితంగా తల్లి అయి ఉంటుందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

కాగా..లవర్స్‌ను చెప్పుతో కొట్టిన మహిళపై పాకిస్థానీ జర్నలిస్టు కూడా మండిపడ్డారు. ‘‘కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇష్టంలేని బంధాల్లో ఇరుక్కుని అలమటిస్తున్నా సహిస్తారు కానీ ప్రేమపెళ్లిళ్లకు మాత్రం ఒప్పుకోరు’’ అంటూ కామెంట్ చేశారు. ఇక నెటిజన్లు కూడా ఆ ప్రేమికుల పరిస్థితి చూసి జాలిపడ్డారు. ‘‘కొందరు తల్లిదండ్రులతో వచ్చే తంటా ఇదే. ఎవరూ తమ సంతానంతో ఇలా వ్యవహరించకూడదు. దీని వల్ల పిల్లలు కుటుంబాలకు దూరమవుతారు. ఆ తరువాత తల్లిదండ్రులే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి..ఇలా చేయి చేసుకోవడం కంటే ఇద్దరితో సానుకూలంగా చర్చించడమే బెటర్’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.


More Telugu News