'సార్' సినిమా 3 రోజుల వసూళ్లు ఇవే!
- ధనుశ్ హీరోగా వచ్చిన 'సార్'
- 3 రోజుల్లో 16.54 కోట్ల గ్రాస్ వసూలు
- సందేశంతో కూడిన వినోదంతో నడిచే కథ
- ధనుశ్ నటనే ప్రధానమైన ఆకర్షణ
'జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్ .. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్' అనే కాన్సెప్టును కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు ఆచరణలోకి తెచ్చారు. ఈ కారణంగా ఎక్కువ ఫీజులు చెల్లించలేని సామాన్య విద్యార్థులు చదువుకు దూరమవుతూ ఉన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెక్చరర్ చేసిన పోరాటమే 'సార్' సినిమా.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 16.54 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించి, లాభాల్లోకి ఎంటర్ కావడం విశేషం.
"ఒక సాధారణ లెక్చరర్ తన కెరియర్ పై ఆశతో ఓ గ్రామానికి వెళతాడు. కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతుల పాదాల క్రింద నిరుపేదల పిల్లలు ఎలా నలిగిపోతున్నారనేది తెలుసుకుని, తన కెరియర్ ను పణంగా పెట్టి వాళ్లను పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. సందేశంతో కూడిన ఈ సినిమాకి ధనుశ్ నటన హైలైట్ గా నిలిచింది.