హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్.. మూడు రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
- నేటి నుంచి బుధవారం వరకు 33 రైళ్ల రద్దు
- సాంకేతిక కారణాల వల్లేనన్న అధికారులు
- గురువారం నుంచి యథావిధిగా సేవలు అందుబాటులోకి
హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. మొత్తం 33 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే వీటిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది.
లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్, రామచంద్రాపురం-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-రామచంద్రాపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్ రైలు సర్వీసులను నేటి నుంచి బుధవారం వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఎంఎంటీఎస్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.