వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విశేష ఆదరణ.. క్యూ కడుతున్న ప్రయాణికులు

  • 140 శాతానికి పైగా నమోదవుతున్నఆక్యుపెన్సీ రేషియో
  • జనవరి 16 నుంచి ఈ నెల 17 వరకు 29 ట్రిప్పులు
  • సికింద్రాబాద్ నుంచి 47,055 మంది ప్రయాణం
  • విశాఖ నుంచి 44,938 మంది ప్రయాణం
సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ రైలులో ప్రయాణించేందుకు జనం క్యూ కడుతున్నారు. ఫలితంగా ఆక్యుపెన్సీ రేషియో 140 శాతానికి పైగా నమోదవుతోంది. జనవరి 16 నుంచి ఈ నెల 17 వరకు మొత్తం 29 ట్రిప్పులు నడవగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు 47,055 మంది, విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌కు 44,938 మంది ప్రయాణించారు. 

అలాగే, సికింద్రాబాద్-విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్‌లో సగటున ఒక ట్రిప్‌లో 1,623 మంది ప్రయాణిస్తుండగా వీరిలో 1,099 మంది సికింద్రాబాద్‌లో ఎక్కినవారే. విజయవాడలో 341 మంది, వరంగల్‌లో 76, ఖమ్మంలో 55 మంది, రాజమండ్రిలో 52 మంది రైలు ఎక్కుతున్నారు.

విశాఖపట్టణం నుంచి బయలుదేరే రైలులో సగటున 1,550 మంది ప్రయాణిస్తుండగా వీరిలో ఒక్క విశాఖలోనే 1,049 మంది రైలు ఎక్కుతున్నారు. విజయవాడలో 297, రాజమండ్రిలో 138, వరంగల్‌లో 24, ఖమ్మంలో 41 మంది రైలులో  ప్రయాణిస్తున్నారు.


More Telugu News