రోహిత్ శర్మ మాట అందరూ వింటారు: ద్రావిడ్
- ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా విజయం
- రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతమని పేర్కొన్న కోచ్ ద్రావిడ్
- రోహిత్ శర్మ మాటకు ఎంతో విలువ ఉందని వెల్లడి
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించిన అనంతరం కోచ్ రాహుల్ ద్రావిడ్ మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం అద్భుతం అని కొనియాడాడు. డ్రెస్సింగ్ రూపంలో రోహిత్ శర్మ మాటకు ఎంతో విలువ ఉందని తెలిపాడు.
"రోహిత్ శర్మ సుదీర్ఘకాలంగా జట్టులో ఉన్నాడు. అతడు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ అతడు ఏదైనా చెబితే మాత్రం అందరూ అతడి మాట చక్కగా వింటారు. రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్ల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. డ్రెస్సింగ్ రూం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చూస్తాడు. కోహ్లీ వంటి వ్యక్తుల నుంచి రోహిత్ శర్మ నాయకత్వం అందుకోవడం అదృష్టం అని చెప్పాలి" అని ద్రావిడ్ వివరించాడు.