కుప్పకూలిన ఆస్ట్రేలియా.. భారత్ విజయ లక్ష్యం 115

  • రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే ఆలౌటైన ఆసీస్
  • జడేజాకు ఏడు వికెట్లు, అశ్విన్ కు మూడు వికెట్లు
  • ఛేదనలో లంచ్ విరామానికి భారత్ 14/1
ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కు ఆస్ట్రేలియా 115 పరుగుల చిన్న లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది. తొలి రెండు రోజులు ఆతిథ్య జట్టుకు సవాల్ విసిరిన ఆసీస్.. ఆదివారం తేలిపోయింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా దెబ్బకు కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 61/1తో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు ఆధిక్యం కలుపుకొని భారత్ కు 115 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జడేజా ఏడు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. 

ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (43), లబుషేన్ (35) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇక, లక్ష్య ఛేదనలో లంచ్ విరామ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 14 పరుగులతో నిలిచింది. రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్ (1) లైయన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రోహిత్, పుజారా క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 101 పరుగులు కావాలి.


More Telugu News