తారకరత్న మృతిపై స్పందించిన ప్రధాని మోదీ
- ఆయన అకాల మరణం బాధాకరమన్న మోదీ
- సినీ ప్రపంచంలో తనదైన ముద్రవేశారన్న ప్రధాని
- రేపు హైదరాబాద్ లో తారకరత్న భౌతిక కాయానికి అంత్యక్రియలు
తెలుగు సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘నందమూరి తారక రత్న గారి అకాల మరణం బాధాకరం. చలనచిత్ర, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతోనే ఉన్నాయి. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు.
గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్‌కు తరలిస్తారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.