గుజరాత్‌లో మేనల్లుడి పెళ్లి బరాత్ లో ఇంటిపై నుంచి కురిసిన రూ. 500 నోట్ల వర్షం.. అందుకునేందుకు ఎగబడిన జనం!

  • గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఘటన
  • వర్షాన్ని తలపించిన నోట్లు
  • పట్టుకునేందుకు జనం పోటీ
గుజరాత్‌లోని మెహసానాలో ఓ ఇంటిపై నుంచి రూ. 500 నోట్ల వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. తమ కుమారుడి వివాహాన్ని పురస్కరించుకుని జిల్లాలోని కడీ తాలూకాలోని గ్రామంలో ఓ కుటుంబం ఇంటిపై నుంచి నోట్లను కిందికి విసిరింది. డాబాపై నించున్న వ్యక్తులు నోట్లను కిందికి విసరడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

నోట్లు పెద్ద ఎత్తున గాల్లోకి లేవడంతో వర్షం కురుస్తున్నట్టుగా కనిపించింది. వాటిని ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. కిందపడిన, గాల్లో ఎగురుతున్న నోట్లను పట్టుకునేందుకు జనం పోటీ పడడంతో తోపులాట జరిగింది. మాజీ సర్పంచ్ అయిన కరీంబాయి దాదుబాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహం సందర్భంగా ఆ కుటుంబం ఇలా నోట్లను వెదజల్లినట్టు తెలుస్తోంది. వారి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానమని, అతడి పెళ్లి సందర్భంగా ఆనందంతో వారిలా నోట్లను గాల్లోకి విసిరారని చెబుతున్నారు.


More Telugu News