అనపర్తి ఘటనపై ఇన్చార్జి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వివరణ
- చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్ లో కేసు నమోదు
- పోలీసులను తోసివేయడంతో కేసు నమోదు చేశామన్న ఇన్చార్జి ఎస్పీ
- ఇరుకు ప్రాంతం కావడంతో అనపర్తి సభకు అనుమతి ఇవ్వలేదని వెల్లడి
- అనుమతి ఇవ్వకపోయినా సభ జరిపారని ఆరోపణ
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పరిణామాల నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం తెలిసిందే. దీనిపై ఇన్చార్జి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి స్పందించారు. పోలీసులను తోసివేయడం వల్లే చంద్రబాబుపై కేసు నమోదైనట్టు స్పష్టం చేశారు. ఇరుకు ప్రాంతం కావడంతో అనపర్తిలో టీడీపీ సభకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అనపర్తి సభకు అనుమతి నిరాకరించామని వివరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా అనపర్తిలో సభ నిర్వహించారని ఇన్చార్జి ఎస్పీ వెల్లడించారు. మరో చోట సభ జరుపుకోవాలని చెప్పినా, మెయిన్ రోడ్ మీదే సభ పెట్టారని ఆరోపించారు. గోకవరంలో పోలీసులు చంద్రబాబు సభను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఆయా పరిణామాలపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ జరుపుతామని అన్నారు.