వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • ఇవాళ కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు
  • తాజాగా ఆయన తండ్రికి నోటీసులు
  • ఈ నెల 23న విచారణకు రావాలని స్పష్టీకరణ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోమారు నోటీసులు జారీ చేసిన సీబీఐ, తాజాగా అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కడప లేదా హైదరాబాదు... ఎక్కడికి వస్తారో చెప్పాలని నోటీసుల్లో అడిగింది. ఇంటివద్దనే విచారణ చేస్తామంటూ వెసులుబాటు ఇచ్చింది. 

అయితే, భాస్కర్ రెడ్డి ఆ నోటీసులకు బదులిచ్చారు. ఈ నెల 23న తాను విచారణకు రాలేనని సీబీఐకి స్పష్టం చేశారు. ఆ రోజున ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, కొత్త విచారణ తేదీతో భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. 

 కాగా, ఈ నెల 24న విచారణకు రావాలని అవినాశ్ రెడ్డికి పంపిన నోటీసుల్లో పేర్కొనడం తెలిసిందే. అవినాశ్ రెడ్డిని హైదరాబాద్ రావాలని ఆ నోటీసుల్లో కోరారు.


More Telugu News