వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి: ఆదినారాయణరెడ్డి
- వైఎస్ అవినాశ్ రెడ్డిని మరోసారి విచారణకు పిలిచిన సీబీఐ
- విచారణ ఒక క్రమం ప్రకారం జరుగుతోందన్న ఆదినారాయణరెడ్డి
- విచారణకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని రెండోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఒక క్రమం ప్రకారం కొనసాగుతోందని ఆయన అన్నారు. 24వ తేదీన సీబీఐ విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని... వేరే కారణాలు చెప్పి ఇంతకు ముందులా విచారణకు గైర్హాజరైతే, దాన్ని సీబీఐ అధికారులు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. విచారణ తర్వాత అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.