ఇంగ్లీషు రాక క్రీడా పాత్రికేయుడి తంటాలు... వీడియో ఇదిగో!

  • బంగ్లా ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర దృశ్యం
  • మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతో మాట్లాడేందుకు జర్నలిస్టు ప్రయత్నం
  • వచ్చిరాని ఇంగ్లీషుతో ఇబ్బందులు
  • అతడేం అడుగుతున్నాడో తెలియక తలలు పట్టుకున్న క్రికెటర్లు
బంగ్లాదేశ్ లో జరుగుతున్న బంగ్లా ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లను మీడియా పలకరించడం సాధారణ విషయమే. అయితే, ఓ మీడియా సంస్థకు చెందిన క్రీడా పాత్రికేయుడు కూడా ఆటగాళ్లతో మాట్లాడేందుకు రంగంలోకి దిగాడు. అయితే అతగాడికి ఇంగ్లీషు రాదు. వచ్చీ రాని ఇంగ్లీషుతో మ్యాచ్ ఎలా సాగిందని ఆటగాళ్లను అడిగే ప్రయత్నం చేశాడు. 

తొలుత ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీని పలకరించాడు. అతడేం మాట్లాడుతున్నాడో మొయిన్ అలీకి అర్థంకాక "ఏమంటున్నారు..." అంటూ పదే పదే అడిగాడు. ఆ తర్వాత వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ను కూడా ఆ మీడియా ప్రతినిధి తన భాషతో ఇబ్బంది పెట్టాడు. 

నువ్వు అడిగిన దానికి అర్థం ఏమిటి? అని రసెల్ తిరిగి ఈ జర్నలిస్టును ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News