వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
- గత నెలలో అవినాశ్ ను తొలిసారి విచారించిన సీబీఐ
- ఈ నెల 24న హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు
- నోటీసులను వాట్సాప్ ద్వారా పంపిన సీబీఐ అధికారులు
కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో ఇటీవలే విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ తాజాగా మరోసారి అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. నోటీసు ప్రతులను సీబీఐ అధికారులు వాట్సాప్ ద్వారా ఎంపీ అవినాశ్ రెడ్డికి పంపించారు.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి తొలిసారిగా గత నెల 28న సీబీఐ ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అవినాశ్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి తొలిసారిగా గత నెల 28న సీబీఐ ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అవినాశ్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.