సింహం ఎవరో నిన్న అనపర్తి ఘటనతో తేలిపోయింది: ఎంపీ రఘురామకృష్ణరాజు
- నిన్న తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు
- పోలీసులు అడ్డుకున్నా కాలినడకన అనపర్తి చేరుకున్న చంద్రబాబు
- సింహం అని జగన్ తనకు తానే ప్రకటించకున్నారన్న రఘురామ
- సింహం పరదాల చాటున వస్తుందా అంటూ సందేహం
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనపర్తి ఘటనలను చంద్రబాబుపై దాడిగానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. తాను సింహాన్ని అంటూ జగన్ స్వయంగా ప్రకటించుకున్నారని, కానీ పరదాల చాటున వచ్చేవారిని సింహం అంటారా...? అని సందేహం వెలిబుచ్చారు. సింహం ఎవరో నిన్న అనపర్తి ఘటనతో వెల్లడైందని స్పష్టం చేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, అందుకే ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ కు లోనవుతోందని రఘురామకృష్ణరాజు అన్నారు. మా పార్టీకి చెడ్డరోజులు, ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. పరిస్థితి చూస్తుంటే మా పార్టీకి కనీసం 25 సీట్లు కూడా వచ్చేలా లేవు అని తెలిపారు.