ఏపీ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, వైసీపీ నేత పాతపాటి సర్రాజు హఠాన్మరణం
- 2004లో ఉండి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపు
- గత రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరు
- ఇంటికి వెళ్లాక గుండెపోటుకు గురైన సర్రాజు
- 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నేత
ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గత అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. 2004లో ఉండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2014కు ముందు వైసీపీలో చేరి మళ్లీ ఉండి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.
గత రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.