సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు పెద్ద ఊరట

  • రచ్చరచ్చ అవుతున్న ఢిల్లీ మేయర్ ఎన్నిక
  • ఎన్నికల్లో ఆప్ కేేే ఆధిక్యం
  • మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయొద్దన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ మేయర్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు పెద్ద ఊరట లభించింది. మేయర్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, ఆప్ ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. నామినేటెడ్ మెంబర్ల సాయంతో మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని బీజేపీ యత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆప్ కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓటు వేయరాదని తీర్పును వెలువరించింది. 

ఇప్పటికే ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. మూడు నెలలకు పైగా మేయర్ ఎన్నిక పంచాయతీ నడుస్తోంది. డిసెంబర్ లో జరిగిన సివిక్ బాడీ ఎన్నికల్లో ఆప్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినప్పటికీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి బీజేపీ తన ప్రయత్నాలను చేస్తోందని ఆప్ మండిపడుతోంది. ఆప్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... ముందుగా మేయర్ ఎన్నిక మాత్రమే జరగాలని ఆదేశించింది. 

నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేసింది. మేయర్ ఎన్నిక పూర్తి అయిన తర్వాతే... డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలని స్పష్టం చేసింది. మేయర్ ఎన్నిక పూర్తయిన తర్వాత... ఆయన నేతృత్వంలోనే తదుపరి సివిక్ బాడీ సమావేశాలు జరుగుతాయని... ఆ సమావేశాల్లోనే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పును వెలువరించారు.



More Telugu News