'సార్' రెస్పాన్స్ పై స్పందించిన మేకర్స్!
- ఈ రోజునే థియేటర్స్ కి వచ్చిన 'సార్'
- సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన మేకర్స్
- ఏడాది తరువాత సక్సెస్ పడిందన్న సూర్యదేవర నాగవంశీ
- కోలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తుందన్న వెంకీ అట్లూరి
విద్యను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక లెక్చరర్ సాగించిన పోరాటమే 'సార్'. చదువు తప్ప జీవితాలను మరేదీ మార్చలేదంటూ, గ్రామీణ విద్యార్థులను చైతన్యవంతులను చేసిన ఒక 'సార్' కథ ఇది. ధనుశ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ద్వారా సందేశాన్ని ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందంటూ మేకర్స్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ .. "నా బ్యానర్లో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి వచ్చిన 'భీమ్లా నాయక్' .. 'డీజే టిల్లు'కి హౌస్ ఫుల్స్ పడ్డాయి. 'స్వాతిముత్యం' రిపోర్ట్ బాగున్నా రెవెన్యూ పెద్దగా రాలేదు. 'బుట్టబొమ్మ'కి రిపోర్టు .. రెవెన్యూ రెండూ లేవు. చాలా రోజుల తరువాత 'సార్'తో సక్సెస్ వచ్చింది. కోలీవుడ్ నుంచి కూడా మంచి టాక్ వస్తోంది" అని అన్నారు.
ఇక దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. 'తొలిప్రేమ' తరువాత నాకు సక్సెస్ పడలేదు. ఆ తరువాత చాలామంది నన్ను తప్పించుకుని తిరిగారు. నేను ఈ సినిమాను ఒక ప్రేక్షకుడిగానే చెన్నైలో చూశాను. అక్కడ థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందనేది చూడాలి" అన్నారు.