మార్చి 31 నుంచి ఐపీఎల్... మళ్లీ పాత పద్ధతిలోనే పోటీలు!
- ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ విడుదల
- 52 రోజుల పాటు లీగ్ దశ పోటీలు
- ప్లే ఆఫ్ షెడ్యూల్ త్వరలో విడుదల
- మే 28న ఫైనల్
- ఈసారి ఇంటా, బయటా పద్ధతిలో మ్యాచ్ లు
క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ వస్తోంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 28న నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఐపీఎల్-16 షెడ్యూల్ విడుదల చేసింది. 16వ సీజన్ తొలిమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
లీగ్ దశలో మొత్తం 52 రోజుల పాటు 70 మ్యాచ్ లు జరుగుతాయి. 12 వేదికల్లో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తారు.
కరోనా సంక్షోభం కారణంగా గత సీజన్ లో కొన్ని నగరాల్లోనే మ్యాచ్ లు నిర్వహించడం తెలిసిందే. కరోనా వ్యాప్తి తగ్గిపోవడంతో ఈసారి మునుపటి తరహాలోనే ఇంటా, బయట విధానంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. దాంతో ఆయా జట్లు సొంతగడ్డ ప్రయోజనాన్ని పొందే వీలుంటుంది.