ప్రతి క్రిమినల్ కి ఒక వీక్ నెస్ ఉంటుంది: 'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మరో ట్రైలర్

  • కిరణ్ - కశ్మీర జంటగా 'వినరో భాగ్యము విష్ణుకథ'
  • తిరుపతి నేపథ్యంలో నడిచే కథ 
  • సంగీతాన్ని అందించిన చైతన్ భరద్వాజ్ 
  • ఈ నెల 18వ తేదీన విడుదలవుతున్న సినిమా 
గతంలో తిరుపతి నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా కూడా తిరుపతి నేపథ్యంలోనే నడుస్తుంది. కిరణ్ అబ్బవరం - కశ్మీర పరదేశి జంటగా నటించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించగా, దర్శకుడిగా కిశోర్ పరిచయమవుతున్నాడు.

ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, కొంతసేపటి క్రితం మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'ప్రతి క్రిమినల్ కి ఒక వీక్ నెస్ ఉంటుంది' అనే డైలాగ్ కిరణ్ పాత్రపై కుతూహలాన్ని పెంచుతోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఆమని .. శుభలేఖ సుధాకర్ .. మురళీశర్మ .. ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. వరుస ఫ్లాపులతో ఉన్న కిరణ్ ను ఈ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందనేది చూడాలి మరి.



More Telugu News