ఆణిముత్యం అంటూ.. కిషన్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
- మెడికల్ కాలేజీలపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
- గతంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్
- అబద్ధాలైనా ఒకేలా చెప్పేలా కేంద్ర మంత్రులకు శిక్షణ ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి సూచన
మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. అసలు ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయనే సమాచారం కూడా తెలంగాణ ప్రభుత్వం వద్ద లేదని బీజేపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గతంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
‘‘9 మెడికల్ కాలేజీలు ఇచ్చామని కిషన్ రెడ్డి చెబుతున్నారు. అసలు తెలంగాణ నుంచి ప్రతిపాదనలే రాలేదని మన్సుఖ్ మాండవీయ అంటున్నారు. రెండు ప్రతిపాదనలు వచ్చాయని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. మోదీజీ.. కనీసం అబద్ధాలైనా ఒకేలా చెప్పేలా కేంద్ర మంత్రులకు శిక్షణ ఇవ్వండి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో లేని వైద్య కాలేజీలను సృష్టించిన ఘనత కిషన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రుల్లో కిషన్ రెడ్డి ఆణిముత్యమని సెటైర్ వేశారు.