వామ్మో... అరక దున్నడం ఇంత కష్టమా అంటున్న రేవంత్ రెడ్డి... వీడియో ఇదిగో!

  • పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి
  • స్టేషన్ ఘన్ పూర్ లో ఓ పొలాన్ని సందర్శించిన రేవంత్
  • అరక దున్నలేక ఇబ్బందిపడిన టీపీసీసీ చీఫ్
  • బెదిరిన ఎద్దులతో అగచాట్లు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల వారిని కలుస్తూ ముందుకు పోతున్నారు. పాదయాత్రకు నేడు 11వ రోజు కాగా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముచ్చటించారు. పొలంలో అరక దున్నుతున్న రైతు వద్దకు వెళ్లి, సేద్యం తీరుతెన్నులు పరిశీలించారు. ఆ తర్వాత తాను అరక దున్నే ప్రయత్నం చేశారు. 

అయితే, జనాలను చూసి బెదిరిన ఆ ఎద్దులను నియంత్రించలేక రేవంత్ రెడ్డి ఆపసోపాలు పడ్డారు. నాగలి కర్రును రేవంత్ గట్టిగా భూమిలోకి అదిమి పట్టుకోలేకపోవడంతో ఆ ఎద్దులు ఇష్టారాజ్యంగా పరుగులు తీశాయి. దాంతో రేవంత్ అరక దున్నలేక ఇబ్బందిపడ్డారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి వీడియో సహా ట్విట్టర్ లో పంచుకున్నారు. 

వ్యవసాయం అంటే ఎంత కష్టమో అని పేర్కొన్నారు. రైతుల శ్రమ అంతాఇంతా కాదని పేర్కొన్నారు. మనమేమో హాయిగా ఇళ్ల వద్ద కూర్చుని ఆహారాన్ని ఆస్వాదిస్తుంటామని తెలిపారు. రైతులందరికీ సెల్యూట్ చేస్తున్నానని రేవంత్ వెల్లడించారు.


More Telugu News