చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

  • ఆమోదించిన బీసీసీఐ కార్యదర్శి జై షా
  • ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ వ్యాఖ్యలు వివాదాస్పదం
  • బోర్డు సీరియస్ గా తీసుకోవడంతో రాజీనామా చేసిన శర్మ
ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పదవి నుంచి తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపించారు. దీనికి జై షా ఆమోదం తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో చేతన్ పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కొందరు ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకొని ఫిట్ నెస్ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పాడు. 

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు వచ్చాయన్నాడు. జట్టుకు సంబంధించి సున్నిత, రహస్య విషయాలు వెల్లడించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో, గత నెలలోనే మరో పర్యాయం చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శర్మ పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News