లోకేశ్ పాదయాత్రపై టెన్షన్.. ఈనాటి రూట్ మ్యాప్ కు అనుమతి నిరాకరించిన పోలీసులు

  • 22వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర
  • మహా శివరాత్రి నేపథ్యంలో మరో రూట్ లో యాత్ర చేసుకోవాలన్న పోలీసులు
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. మరోవైపు పాదయాత్రలో టెన్షన్ నెలకొంది. బైరాజు కండ్రిగ విడిది కేంద్రం నుంచి మొదలైన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. టీడీపీ నేతలు ఇచ్చిన రూట్ మ్యాప్ కు అభ్యంతరం తెలిపారు. 

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున... శ్రీకాళహస్తి పట్టణంలోని చతుర్మాడ వీధుల్లోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈనాటి పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పోలీసులకు టీడీపీ నేతలు ఎప్పుడో ఇచ్చారు. అయితే, టీడీపీ నేతలు ఇచ్చిన రూట్ మ్యాప్ కు తాజాగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కొత్తపేట, తెట్టు, భాస్కర్ పేట, నాయుడుపేట బైపాస్ మీదుగా ఏఎం పుత్తూరు, బీపీ అగ్రహారం మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బస ప్రదేశం వరకు యాత్రను చేసుకోవచ్చని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. 



More Telugu News