12 రోజులపాటు రోజూ బాదం.. మధుమేహానికి దూరం!

  • చెన్నైలోని మద్రాసు మధుమేహ పరిశోధన సంస్థ నేతృత్వంలో పరిశోధన
  • 26-65 ఏళ్ల మధ్య వయసున్న 400 మందిపై పరిశోధనలు
  • క్లోమ గ్రంధి పనితీరును మెరుగుపరచనున్న బాదం
  • బీఎంఐ ఇండెక్స్‌లోనూ తగ్గుదల
ఊబకాయం.. మధుమేహం.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రెండు అతిపెద్ద సమస్యలు ఇవి. శాశ్వత పరిష్కారమంటూ ఎరుగని ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి లింకై ఉంటాయి. ఊబకాయం ఉన్న వారికి మధుమేహ ముప్పు కూడా ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యం. ఆహారాన్ని నియంత్రించడం.. క్రమం తప్పని వ్యాయామం ద్వారా వీటిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ రెండు సమస్యలపై ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు కూడా ఇవే చెబుతున్నాయి. 

తాజాగా చెన్నైలోని మద్రాసు మధుమేహ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకుల నేతృత్వంలో 26-65 ఏళ్ల మధ్య వయసున్న 400 మందిపై జరిగిన అధ్యయనంలో మరో కొత్త విషయం వెల్లడైంది. వరుసగా 12 రోజులపాటు క్రమం తప్పకుండా బాదంలను తింటే క్లోమం పనితీరు మెరుగుపడుతుందని తేలింది. ఫలితంగా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వల నియంత్రణ మెరుగవుతుంది. అలాగే బీఎంఐ ఇండెక్స్‌లోనూ తగ్గుదల కనిపిస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారిలో డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది.


More Telugu News