టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా.. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్!

  • సీఈవో పదవి నుంచి వైదొలగిన సూసన్ వొజిసికి
  • 2008లో గూగుల్‌లో చేరిన నీల్ మోహన్
  • ప్రస్తుతం చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న నీల్ మోహన్
  • నీల్ మోహన్‌కు సుందర్ పిచాయ్ అభినందన
టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులు నియమితులు కాగా తాజాగా వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు.

ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన సూసన్ వొజిసికి వైదొలగడంతో యూట్యూబ్‌లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న నీల్ మోహన్‌ను సీఈవోగా నియమించింది. యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్‌కు సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. కాగా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నీల్ మోహన్ 2008 నుంచి గూగుల్‌లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్, స్టిచ్ ఫిక్స్, జెనోమిక్స్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ  ‘23 అండ్ మి’లోనూ పనిచేశారు.


More Telugu News