సీఎం జగన్ ను కలిసిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
- క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన చాగంటి
- ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి
- చాగంటికి శాలువా కప్పి సన్మానించిన సీఎం జగన్
- గోశాలను సందర్శించి సీఎం జగన్ ను ప్రశంసించిన చాగంటి
బుల్లితెరపైనా, వివిధ కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక విశేషాలను వివరించే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. చాగంటి కోటేశ్వరరావు ఈ సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎం జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
చాగంటి కోటేశ్వరరావు ఇటీవల టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తనను కలిసిన చాగంటిని సీఎం జగన్ శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.
అదే సమయంలో సీఎం జగన్ ను శాంతా బయోటెక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి కూడా కలిశారు. సీఎంతో సమావేశం అనంతరం చాగంటి కోటేశ్వరరావు, కేఐ వరప్రసాద్ రెడ్డి సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు. అక్కడ గోవులను పరిరక్షిస్తున్న తీరు పట్ల సీఎం జగన్ ను చాగంటి అభినందించారు.