ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు సీబీఐ కోర్టులో చుక్కెదురు

  • బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సీబీఐ కోర్టు
  • ఇప్పటికే పలువురి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • రూ. 2,873 కోట్ల స్కామ్ జరిగిందన్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులోని నిందితులకు సీబీఐ కోర్టులో షాక్ తగిలింది. బెయిల్ కోసం శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్, బినోయ్ బాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులు పెట్టుకున్న బెయిల్ పెటిషన్ ను కోర్టు కొట్టేసింది. 

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆప్ నేత విజయ్ నాయర్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు ఇళ్లను ఈడీ అటాచ్ చేసింది. దీంతో పాటు దినేశ్ అరోరాకు చెందిన రెస్టారెంట్ ను, అమిత్ అరోరాకు చెందని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రుకు చెందిన రూ. 35 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ. 2,873 కోట్ల స్కామ్ జరిగిందని... ఇప్పటి వరకు రూ. 76.54 కోట్ల నగదును పట్టుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు.


More Telugu News