'సార్' సినిమా రిజల్టుపైనే స్టార్ హీరోల దృష్టి!
- టాలీవుడ్ మేకర్స్ తో 'వారసుడు' చేసిన విజయ్
- తమిళనాట 300 కోట్లకి పైగా వసూళ్లు
- 'సార్' సినిమాను అదే రూట్లోకి తీసుకుని వెళుతున్న ధనుశ్
- కొత్త రికార్డులు ఖాయమంటున్న మేకర్స్
- ఇదే పద్ధతిని కోలీవుడ్ లో ఆచరణలోపెట్టే ఆలోచనలో టాలీవుడ్ స్టార్స్
ధనుశ్ - వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందిన 'సార్' సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లకు రానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను రేపే రిలీజ్ చేయనున్నారు. ఇటు టాలీవుడ్ స్టార్ హీరోలు .. అటు కోలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు.
ఈ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ మార్కెట్ పై కాస్త గట్టిగానే శ్రద్ధ పెట్టారు. ఇక్కడి దర్శక నిర్మాతలతో సినిమాలు చేసి కోలీవుడ్ లోను అదే రోజున రిలీజ్ చేసుకుంటున్నారు. ఇది తెలుగు సినిమా అనే ఫీలింగ్ ఇక్కడి ప్రేక్షకులకు ఉంటుంది. ఇది మన హీరో సినిమానే అనే ఆలోచన అక్కడి ఆడియన్స్ కి ఉంటుంది. దాంతో అక్కడి హీరోలకు ఇక్కడ .. ఇక్కడి నిర్మాతలకు అక్కడ గిట్టుబాటు అవుతుంది.
ఇదే పద్ధతిలో 'వారసుడు' టైటిల్ తో విజయ్ సినిమా ఇక్కడ, 'వరిసు' టైటిల్ తో అక్కడ విడుదలైంది. ఇక్కడ గట్టిపోటీ ఉండటం వలన ఓ మాదిరిగా ఆడినా, తమిళనాట ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూలు చేసింది. రేపు అదే మేజిక్ 'సార్ ' సినిమా విషయంలోను జరగొచ్చు. అలా జరిగితే టాలీవుడ్ మేకర్స్ తో సినిమాలు చేయడానికి సూర్య .. కార్తి .. విశాల్ రెడీగా ఉన్నారు. ఇక ఇదే కాన్సెప్టు ను కోలీవుడ్ లో అప్లై చేయడానికి ఇక్కడి హీరోలు కూడా రెడీ అవుతున్నారు. ఇదంతా కూడా 'సార్' సినిమా రిజల్టుపై ఆధారపడి ఉందన్న మాట.