ఉత్తరకొరియా మా శత్రువే: దక్షిణకొరియా

  • డిఫెన్స్ డాక్యుమెంట్ లో శత్రువు అనే పదాన్ని వాడిన దక్షిణకొరియా
  • ఆరేళ్ల తర్వాత తొలిసారి శత్రువు అనే పద వినియోగం
  • ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం
ఉత్తరకొరియా, దక్షిణకొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగుతుండటమే కాని... ఏమాత్రం తగ్గడం లేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దశాబ్దాలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరకొరియా తమ శత్రుదేశమేనని తాజాగా దక్షిణకొరియా మరోసారి స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తమ డిఫెన్స్ డాక్కుమెంట్ లో పేర్కొంది. ఆరేళ్ల తర్వాత ఉత్తరకొరియాను ఉద్దేశించి శత్రువు అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది. తద్వారా ఉత్తరకొరియాతో రానున్న రోజుల్లో కూడా కఠినంగా వ్యవహరించబోతున్న సంకేతాలను పంపింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News