ఎయిర్ ఇండియా భారీ డీల్.. ఏకంగా 840 విమానాల కొనుగోలు..!
- 470 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్, బోయింగ్‌తో ఎయిర్ ఇండియా ఒప్పందం
- అదనంగా 370 విమానాల పర్ఛేజ్ రైట్స్ కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియా
- మొత్తం 840 విమానాల కొనుగోలుకు అవకాశం
- ఆధునిక విమానాలతో ఇంధనం ఆదా.. లాభాల్లో పెరుగుదల
ఎయిర్ ఇండియా రికార్డు స్థాయిలో మొత్తం 840 కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తాజాగా ధ్రువీకరించారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా.. ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలు, బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీనికి అదనంగా వచ్చే పదేళ్లలో 370 విమానాల కొనుగోలుకు వీలుగా బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో ఆప్షన్స్ అండ్ పర్చేస్ రైట్స్‌ను కొనుగోలు చేశామని నిపుణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందాలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాలిస్తే ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నిటికీ భారత్ నుంచి సర్వీసులు నడిపే అవకాశం చిక్కుతుందని అన్నారు. భారత వైమానిక రంగంలోనే ఈ ఒప్పందం ఓ కీలకమైలురాయిగా నిలిచిపోతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎయిర్ ఇండియా పగ్గాలు చేపట్టాక టాటా గ్రూప్.. సంస్థ కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. తొలుత ఆర్డర్ ఇచ్చిన 470 విమానాలు వచ్చే ఆరేడు ఏళ్లలో సంస్థకు అందనున్నాయి. సంస్థ లాభాల బాటపట్టేందుకు కొత్త విమానాలు కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక విమానాలతో ఇంధన వ్యయం తగ్గి లాభాల మార్జిన్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఇక ఎయిర్‌బస్ నుంచి 210 ఏ320/321 నియో/ ఎక్స్ఎల్ఆర్ విమానాలు, 40 ఏ350-900/1000 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఒప్పందం చేసుకుంది. బోయింగ్.. 190 బీ737 మ్యాక్స్, 20 బీ787ఎస్ and 10 బీ777 విమానాలు సరఫరా చేయనుంది.